![]() |
![]() |

జోష్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా పరిచయమమైన జోష్ మూవీలో నటించి జోష్ రవిగా లైంలైట్ లోకి వచ్చాడు. అలాంటి రవి జబర్దస్త్ గురించి కొన్ని కామెంట్స్ చేసాడు. వందకు పైగా మూవీస్ చేసినా కూడా కొన్ని మూవీస్ మాత్రమే అతన్ని నిలబెట్టాయి. "గుండె జారీ గల్లంతయ్యిందే" మూవీలో రవి యాక్షన్ కి ఆడియన్స్ కూడా ఫిదా ఇపోయారు. కెరీర్ స్టార్టింగ్ ఎన్నో కష్టాలు పడిన రవి నెమ్మదిగా నిలదొక్కుకుని కొంత పేరు సంపాదించుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి హాట్ కామెంట్స్ చేసాడు రవి. జబర్దస్త్ 2 లక్షలు లేదా 1 లక్ష ఇస్తామని చెప్పినా తాను వెళ్ళను అని చెప్పాడు.
జబర్దస్త్ అమ్మ లాంటిది, ఎంతో గౌరవం కూడా కానీ తాను సినిమాలే చేస్తానని చెప్పాడు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసాక మళ్ళీ అదే షోకి నాలుగు సార్లు గెస్ట్ గా వెళ్లినట్లు చెప్పాడు. ఇప్పుడు ఉన్న వాళ్లంతా జూనియర్స్ కాదు తమకు సబ్-జూనియర్స్ అని చెప్పాడు. ఇప్పుడు తనను జబర్దస్త్ కి పిలిచినా వెళ్తానని.. స్టేజి ఎక్కి మళ్ళీ స్కిట్ కూడా చేస్తానని చెప్పాడు. రీసెంట్ గా సద్దాం పిలిస్తే వెళ్లి స్కిట్ చేశానని డబ్బులు ఇచ్చినా తీసుకోలేదని చెప్పాడు. జబర్దస్త్ తో తన కెరీర్ స్టార్ట్ కాలేదు కాబట్టి తాను జబర్దస్త్ ని ప్రొఫెషన్ గా పెట్టుకోలేనన్నారు. జబర్దస్త్ లో అంత డబ్బు రాదనీ చెప్పాడు. అప్పట్లో ఇచ్చే పది వేలల్లో రెండు, మూడు వేలను ధన్ రాజ్ ఇచ్చేవాడని చెప్పారు. సినిమాలు లేకపోయినా కామ్ గా కూర్చుంటాను కానీ కంప్రమైజ్ అయ్యి షోస్ కి వెళ్ళను అని చెప్పాడు. తమ ఫామిలీ చాలా కష్టాలు పడి పైకి వచ్చిందని చెప్పాడు జోష్ రవి .
![]() |
![]() |